Nampally Fire: అంతులేని విషాదం.. నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు

by Prasad Jukanti |   (  Updated:2026-01-25 08:51:54  IST  )

నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి.

Nampally Fire: అంతులేని విషాదం..  నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నాంపల్లిలోని (Nampally) ఫర్నిచర్ షాపులో (Furniture Shop Fire) శనివారం సంభవించిన అగ్నిప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో భవనంలో చిక్కుకున్న ఆరుగురిలో ఐదుగురు విగతజీవులగా కనిపించారు. నిర్విరామంగా 22 గంటలకు పైగా సాగించిన రెస్క్యూ ఆపరేషన్‍లో ఆదివారం ఉదయం ఐదుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతులు ప్రణీత్ (8), అఖిల్ (11), బేబీ (45), ఇంతియాజ్ (28), హబీబ్ (32) మృతదేహాలను గుర్తిచారు. డెడ్ బాడీలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మంటల్లో చిక్కుకుపోయిన మరో వ్యక్తి ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులంతా సెల్లార్‍లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బిల్డింగ్‍లో మొత్తం ఆరుగురు ఉన్నట్లు స్థానికులు చెప్పారు.

బిల్డింగ్ దృఢత్వంపై అనుమానాలు:

ప్రమాదం సంభవించిన భవం దృఢత్వంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిన్నటి నుంచి ఏకధాటిగా మంటలు ఎగిసిపడగా దట్టమైన పొగ, వేడి సెగ ఇప్పడికి తగులుతోంది. దీంతో నాలుగు అంతస్తులు కలిగిన ఈ భవనం పిటిష్టతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్‍టీయూ ఇంజినీరింగ్ బృందం ఇప్పటికే ఘటనాస్థలానికి చేరుకుంది. ఈ బృందం బిల్డింగ్‍ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా భవనం విషయంలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు హైడ్రా, పోలీసులు, ఫైర్ సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 9 విభాగాల అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు.

Read More... BREAKING: నాంపల్లి అగ్నిప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్.. ఇద్దరి డెడ్ బాడీలు వెలికితీత

Next Story