BREAKING: నాంపల్లి అగ్నిప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్.. ఇద్దరి డెడ్ బాడీలు వెలికితీత

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-25 06:23:45  IST  )

నాంపల్లిలో నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న ఫర్నీచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు రెస్క్యూ టీమ్ గుర్తించింది.

BREAKING: నాంపల్లి అగ్నిప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్.. ఇద్దరి డెడ్ బాడీలు వెలికితీత
X

దిశ, వెబ్‌డెస్క్: నాంపల్లిలో నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న ఫర్నీచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు రెస్క్యూ టీమ్ గుర్తించింది. మంటల తీవ్రత తగ్గినా.. భవనం లోపలికి వెళ్లే వీల్లేకుండా పొగలు, తీవ్రమైన వేడి ఉండటం, పై కప్పు నుంచి శిథిలాలు ఊడి పడుతుండటంతో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. సుమారు 200 మంది భవనం గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లారు. నిన్నటి నుంచి భవనంలోపల ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి. వారిలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరిని మహిళగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసి అంబులెన్సులో పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురి కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తోంది. వారంతా కూడా దట్టమైన పొగలో ఊపిరాడక మరణించి ఉంటారని బంధువులు ఆందోళన చెందుతున్నారు.

Read More... ఫైర్ సిబ్బందికి విదేశాల్లో శిక్షణ ఇప్పించాలి.. నాంపల్లి ఘటనపై ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు

Next Story