సెల్లార్ లో ప్రమాదకర కెమికల్స్ పెట్టారు.. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-25 08:50:45  IST  )

నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా నిబంధనలను ఉల్లంగించడం వల్లనే జరిగిందని అన్నారు.

సెల్లార్ లో ప్రమాదకర కెమికల్స్ పెట్టారు.. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్
X

దిశ‌, వెబ్ డెస్క్: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా నిబంధనలను ఉల్లంగించడం వల్లనే జరిగిందని అన్నారు. సెల్లార్ లో సామాగ్రి పెట్టకుండా ప్రమాదకరమైన రసాయనాలు రెక్సిన్, మ్యాట్రెసెస్ పెట్టడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. దానివల్లనే ఫైర్ ఇంజిన్లతో పాటు సిబ్బంది ఎంత కృషి చేసినా మంట‌లు ఆర్పేందుకు స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. మ‌రోవైపు వాచ్ మెన్ కుటుంబానికి అదే సెల్లార్ లో వ‌స‌తి క‌ల్పిచ‌డం కూడా నిబంధ‌న‌లు ఉల్లంగించ‌డమేన‌ని చెప్పారు.

చనిపోయిన వారి మృత‌దేహాలు వేరే వేరే ప్ర‌దేశాల్లో దొరికాయ‌ని అన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ మాత్ర‌మే కాకుండా హైడ్రా, పోలీస్ ఇత‌ర డిపార్ట్మెంట్ లు కూడా ఎంత‌గానో స‌హ‌క‌రించాయ‌న్నారు. ఫైర్ డిపార్ట్ మెంట్ నుండి దాదాపు 200 మంది సిబ్బంది పాల్గొన్నార‌ని చెప్పారు. ఫ‌ర్నిచ‌ర్ షాప్ య‌జ‌మాని ఫైర్ డిపార్ట్ మెంట్ నుండి ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేద‌ని అన్నారు. షార్ట్ స‌ర్క్యూట్ లేదా సిగ‌రెట్ ద్వారా ప్ర‌మాదం జ‌రిగి ఉండ‌వచ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. షాపు యజమాని సతీష్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు.

READ MORE ....

ఫైర్ సిబ్బందికి విదేశాల్లో శిక్షణ ఇప్పించాలి.. నాంపల్లి ఘటనపై ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు

Nampally Fire: అంతులేని విషాదం.. నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు

Next Story