ఉత్కంఠ ఎన్నికలు.. బెంగాల్ లో ప్రారంభమైన చివరి దశ పోలింగ్

by Malleboina Mahesh |   (  Updated:2026-04-29 06:23:49  IST  )

బెంగాల్ ఎన్నికల క్లైమాక్స్! నేడు 142 స్థానాలకు చివరి దశ పోలింగ్. భవానీపూర్‌లో మమత వర్సెస్ సువేందు.. ఉత్కంఠగా సాగుతున్న సమరం.

ఉత్కంఠ ఎన్నికలు.. బెంగాల్ లో ప్రారంభమైన చివరి దశ పోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల(Bengal Assembly Elections)కు ఈ రోజు తుది దశ పోలింగ్ (final step is polling) జరుగుతోంది. మొత్తం 294 స్థానాలకు గాను మొదటి దశలో 152 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, మిగిలిన 142 నియోజకవర్గాలకు నేడు (ఏప్రిల్ 29) చివరి దశ ఓటింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. కోల్‌కతా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ వంటి కీలక జిల్లాల్లో సుమారు 3.21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి తలపడుతున్న భవానీపూర్ స్థానంపై అందరి దృష్టి నెలకొంది.

గత ఎన్నికల్లో తలెత్తిన సమస్యలు, అల్లర్ల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించడం తో పాటు, 41,000 పైగా పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేటితో ఈ ఉత్కంఠభరితమైన పోలింగ్ ప్రక్రియ ముగియనుండగా, అభ్యర్థులందరి భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఈ ఎన్నికల తుది ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.

బెంగాల్ ఎన్నికల క్లైమాక్స్.. 11 గంటలకే 39.97% పోలింగ్ నమోదు

Next Story