- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ ఎన్నికల క్లైమాక్స్.. 11 గంటలకే 39.97% పోలింగ్ నమోదు
బెంగాల్‌లో ఓటర్ల సునామీ! 11 గంటలకే 39.97% పోలింగ్ నమోదు. హింసాత్మక ఘటనల మధ్యే కొనసాగుతున్న తుది దశ పోరు.

దిశ, వెబ్ డెస్క్: దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల (Bengal Assembly Elections) తుది దశ పోలింగ్ (Polling) ఉత్సాహంగా కొనసాగుతోంది. భారీ బందోబస్తు నడుమ పండగ వాతావరణంలో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఓటర్లు రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండటంతో ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరుగుతోంది. ఉదయం 9 గంటల సమయానికే 18.39 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటల సమయానికి అది 39.97 శాతానికి చేరుకుంది. ఎండలను సైతం లెక్కచేయకుండా మహిళలు, యువ ఓటర్లు భారీ క్యూలైన్లలో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే వేగం కొనసాగితే మొదటి విడతలో నమోదైన 92 శాతం పోలింగ్ రికార్డు సైతం కనుమరుగయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఈ భారీ ఓటింగ్ మధ్యే పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నదియా జిల్లా చాప్రలో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌పై దుండగులు రాడ్లతో దాడి చేయగా, కొన్ని బూతుల్లో ఈవీఎంలపై ఉన్న బీజేపీ గుర్తు పై స్టిక్కర్లు అంటించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తున్న పలువురు టీఎంసీ నిరసనకారులను అదుపులోకి తీసుకున్నాయి. అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.






