- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూకట్‌పల్లిలో విషాదం: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్/ మేడ్చల్ టౌన్: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పరిధిలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి (suicide attempt) పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లిలో నివాసముంటున్న ఒక కుటుంబం, అప్పుల బాధ తాళలేక బలవన్మరణానికి సిద్దమైంది.
ముందుగా అందరూ కలిసి నిద్రమాత్రలు మింగారు ఆ తర్వాత తమ చేతుల మణికట్టును కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో కుటుంబంలోని ఒకరు అప్పటికే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇది గమనించిన స్థానికులు, సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు మృత్యువుతో పోరాడుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మధ్యతరగతి కుటుంబాల్లో పెరుగుతున్న ఆర్థిక భారాలు ఇలాంటి విషాదాలకు దారితీయడం పై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.
Read More..






