- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pimples: మీ పిల్లలకు ఈ ఏజ్‌లోనే పింపుల్స్ వస్తున్నాయా.. డైట్‌లో ఇవి చేర్చాల్సిందే?
పింపుల్స్ అనేవి చర్మంపై వచ్చే ఒక సాధారణ సమస్య.

దిశ, వెబ్‌డెస్క్: (Pimples) అనేవి చర్మం(skin)పై వచ్చే ఒక సాధారణ సమస్య. చర్మంపై వచ్చే వైట్‌హెడ్స్(Whiteheads), బ్లాక్‌హెడ్స్(Blackheads), ఎరుపు, ఎర్రబడిన స్కిన్ వంటివి పింపుల్స్ లక్షణాలని చెప్పుకోవచ్చు. పింపుల్స్ టీనేజ్‌లో ఎక్కువగా వస్తుంటాయి.
చర్మంపైని చిన్న రంధ్రాలు మూసుకుపోవడం, హార్మోన్ల మార్పులు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు (Bacterial infections), ఒత్తిడి (stress), చర్మంలోని ఆయిల్ గ్రంథులు ఉత్తేజితమవడం వంటి వాటి వల్ల ఫేస్ మీద మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు.
ఇక పింపుల్స్‌ను ప్రేరేపించడానికి మెయిన్ గా పలు ఆహారాలు కూడా కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. మొటిమలను తగ్గించడానికి చాలా మంది ఇంట్లోనే పలు చిట్కాలు ఫాలో అవుతుంటారు. తాజా నిమ్మరసం (lemon juice) యాడ్ చేసి ఫేస్ కు అప్లై చేయడం, ఐస్ డ్యాబ్బింగ్ (Ice dabbing), ముఖాన్ని తాకడం మానుకోవడం, వంటివి అప్లై చేస్తుంటారు.
మరికొంతమంది ముఖంపై ఎక్కువగా పింపుల్స్ అయితే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదిస్తారు. అయితే ఇటీవల ఎనిమదేళ్ల పిల్లల నుంచి 14 ఏళ్ల వయస్సు వారిలో కూడా ఎక్కువగా పింపుల్స్ కనిపించడం చూస్తూనే ఉంటాం. ఈ దశను కౌమార దశ (Adolescent stage)అని పిలుస్తుంటారు.
ఈ వయసులో కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఫేస్ పై పింపుల్స్ అవుతుంటాయి. అయితే మీ పిల్లలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే.. నిపుణులు చెప్పిన ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకోండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాక్లెట్స్, అధిక చక్కెరలు ఉన్న ఆహారాలు తింటే పింపుల్స్ కు కారణమవుతాయి. అంతేకాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. కాగా వీటికి బదులుగా గులాబ్ జామ్(Rose Jam), ఇంట్లోనే రెడీ చేసిన ఖీర్ (Kheer), హల్వా (Halwa), వంటి ఆహారాలను పిల్లలకు పెట్టడం మంచిది. అలాగే పండ్ల రసాలు (Fruit juices), మిల్లెట్స్ (Millets) తో తయారు చేసిన రొట్టేలు వంటివి పిల్లలకు ఇవ్వండని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read Also..
జలుబు, దగ్గుతో బాధ పడేవారు పెరుగు తినకూడదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?






