- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dhanush: బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ధనుష్.. ‘D-54’టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల
హీరోగా మాత్రమే కాదు.. దర్శకుడిగానూ తన సత్తా చాటుతూ కోలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు ధనుష్(Dhanush).

దిశ, సినిమా: హీరోగా మాత్రమే కాదు.. దర్శకుడిగానూ తన సత్తా చాటుతూ కోలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు ధనుష్(Dhanush). వరుస ప్రాజెక్ట్స్‌తో అభిమానులకు పండగ తీసుకొస్తున్నారు. గతేడాది కుబేర, ఇడ్లీ కడై, తేరే ఇష్క్ మే వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ధనుష్, వరుసగా మూడు హిట్స్ సాధించి కెరీర్‌లో మరో గోల్డెన్ ఫేజ్‌లోకి అడుగుపెట్టారు. ఈ విజయాల ఊపుతో ఆగకుండా, ప్రస్తుతం ‘D-54’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు ధనుష్. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ సరసన మమిత బైజు(Mamitha Baiju) హీరోయిన్‌గా నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ జంట మొదటిసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈక్రమంలో.. తాజాగా, సంక్రాంతి సందర్భంగా మూవీ మేకర్స్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘D-54’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అధికారికంగా ‘కర’(kara) అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ, పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ధనుష్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. పోస్టర్‌పై కనిపించిన “కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉండటమే ప్రాణాలతో బ్రతకడానికి ఉన్న ఏకైక మార్గం” అనే ట్యాగ్‌లైన్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఇది పక్కా ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనే సంకేతాలను ఇచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమవుతున్న ‘కర’ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ధనుష్‌కు ‘కర’ కూడా మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని అంతా అభిప్రాయపడుతున్నారు.
Read More..
ధనుష్‌తో సీతారామం బ్యూటీ ప్రేమాయణం.. పెళ్లి డేట్ ఫిక్స్?






