ధనుష్‌తో సీతారామం బ్యూటీ ప్రేమాయణం.. పెళ్లి డేట్ ఫిక్స్?

by Ajay Maddhiboyina |

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న‌ట్టు కోలీవుడ్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొద్దిరోజులుగా వీరిద్ద‌రూ ప‌ర్స‌న‌ల్ రిలేష‌న్ షిప్ లో ఉన్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ధనుష్‌తో సీతారామం బ్యూటీ ప్రేమాయణం.. పెళ్లి డేట్ ఫిక్స్?
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న‌ట్టు కోలీవుడ్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొద్దిరోజులుగా వీరిద్ద‌రూ ప‌ర్స‌న‌ల్ రిలేష‌న్ షిప్ లో ఉన్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాకుండా తాజాగా వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్న‌ట్టుగా కూడా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల దినోత్స‌వం రోజునే వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతున్న‌ట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది. అతి కొద్ది మంది అతిధుల మ‌ధ్య‌నే వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంది అని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ పెళ్లికి ఇరువురి కుటుంబ స‌భ్యుల‌తో పాటు మ‌రికొంద‌రు మ‌ఖ్యఅతిధులు మాత్రమే హాజ‌రుకానున్నార‌ని టాక్. అయితే ప్ర‌స్తుతం వీరి పెళ్లిపై పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి కానీ అటు ధ‌నుష్ కానీ ఇటు మృణాల్ ఠాకూర్ కానీ అంగీక‌రించ‌డం కానీ ఖండించ‌డం కానీ చేయ‌లేదు. ఇక ధ‌నుష్ కు ఇప్ప‌టికే ర‌జినీకాంత్ కుమార్తెతో వివాహం జ‌ర‌గ్గా ఇద్ద‌రు కుమారులు కూడా ఉన్నారు. అయితే ప‌ర్స‌న‌ల్ కార‌ణాల వ‌ల్ల ధ‌నుష్ త‌న భార్య‌తో విడిపోయారు. మృణాల్ సీతారామం సినిమాతో హిట్ కొట్టి వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది.

Next Story