TG: ఉద్యోగులకు మరో భారీ కానుక.. జనవరి నెల జీతంతో పాటే పెంచిన డీఏ చెల్లింపు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-12 13:25:24  IST  )

సంక్రాంతి పండుగ పూట ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.

TG: ఉద్యోగులకు మరో భారీ కానుక.. జనవరి నెల జీతంతో పాటే పెంచిన డీఏ చెల్లింపు
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ పూట ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. 30.03 శాతం నుంచి 33.67 శాతానికి డీఏను సవరణ చేసింది. 2023 జులై 1వ తేదీ నుంచి డీఏ అమలు కానుంది. జిల్లా పరిషత్ మున్సిపాటీ ఉద్యోగులకు, యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా డీఏ వర్తించనుంది. ఈ జనవరి జీతంతో కలిపి డీఏ చెల్లించనుంది. జులై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న బకాయిలు అన్నీ చెల్లించనుంది. బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో వేయనుంది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు 30 విడతల్లో బకాయిలు చెల్లించనుంది. పార్ట్ టైం అసిస్టెంట్లు, వీఆర్ఏలకు నెలకు రూ.100 అదనంగా చెల్లించనుంది.

ఇదిలా ఉంటే.. కాసేపటి క్రితమే డీఏపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. “మీ దగ్గరకు రావడానికి ముందే డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చాను. ఈరోజో, రేపో దీనికి సంబంధించిన జీవో అధికారికంగా వెలువడుతుంది” అని ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 227 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ప్రతి ఉద్యోగికి రూ. కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని, పదవీ విరమణ పొందే వారికి ఇచ్చే బెనిఫిట్స్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

Read More... ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Next Story