నాంపల్లి అగ్నిప్రమాదంపై CP సజ్జనార్ ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-24 14:54:06  IST  )

నాంపల్లి అగ్నిప్రమాద ఘటనా స్థలానికి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేరుకున్నారు.

నాంపల్లి అగ్నిప్రమాదంపై CP సజ్జనార్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: నాంపల్లి అగ్నిప్రమాద(Nampally Fire Incident) ఘటనా స్థలానికి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి సజ్జనార్(CP Sajjanar) మీడియాతో మాట్లాడారు. సెల్లార్ నిండా ఫర్నీచర్ ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌ కష్టంగా ఉందని అన్నారు. ప్రస్తుతం జేసీబీల సాయంతో ఫర్నీచర్ తొలగిస్తున్నట్లు చెప్పారు. లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ అలుముకుందని.. మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. నివాస గృహాల మధ్య ఇలాంటి గోడౌన్లు లేదా దుకాణాలు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందని వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

READ MORE .....

నాంపల్లి అగ్నిప్రమాదం ఎఫెక్ట్.. నుమాయిష్ సందర్శకులకు ముఖ్య గమనిక! సీపీ సజ్జనార్

Next Story