- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాంపల్లి అగ్నిప్రమాదం ఎఫెక్ట్.. నుమాయిష్ సందర్శకులకు ముఖ్య గమనిక! సీపీ సజ్జనార్
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Nampally fire Accident) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ రోడ్డులోని బచ్చాస్ క్యాస్టిల్ ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో భవనంలో ఆరుగురు చిక్కుకోని ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Nampally fire Accident) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ రోడ్డులోని బచ్చాస్ క్యాస్టిల్ ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో భవనంలో ఆరుగురు చిక్కుకోని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నుమాయిష్ (ఎగ్జిబిషన్) వెళ్లే సందర్శకులకు హైదరాబాద్ సీపీ నగర కమిషన్ కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.
ఈ రోజు వాయిదా వేసుకోవాలి..
‘నుమాయిష్ సందర్శకులకు ముఖ్య గమనిక.. నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, అగ్నిప్రమాదం కారణంగా వాహనాలను దారి మళ్లించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన ప్రకటించారు. ఈ రోజు ఎగ్జిబిషన్‌కు రావద్దని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలను ఆర్పేందుకు 8 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫర్నిచర్ షాప్ మొత్తం దట్టంగా పొగ కమ్ముకోవడంతో పాటు షాప్ లోపెద్దమొత్తంలో గ్లాస్, రేకులు ఉండటం సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది.
భవనంలో ఆరుగురు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అందులో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. భవనంలో వేగంగా వ్యాపిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఆ పరిసర ప్రాంతవాసులను ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృదాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. విషయం తెలుసుకున్న సిటీ సీపీ సజ్జనార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సహాయ చర్యలు పరిశీలించారు.
READ MORE .....






