- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో భారీగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ.. 54 మందిపై సీపీ సజ్జనార్ ఉత్తర్వులు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఒకేసారి 54 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లను (CIs) బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Hyderabad Police Commissionerate) పరిధిలో భారీ స్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (Police Commissioner Sajjanar) ఒకేసారి 54 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లను (CIs) బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS), సైబర్ క్రైమ్ విభాగాల నుండి పెద్ద సంఖ్యలో అధికారులు బదిలీ అయ్యారు. గత కొంతకాలంగా ఒకే విభాగంలో కొనసాగుతున్న వారిని, పాలనాపరమైన అవసరాల దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో 26 మంది సీఐలను తక్షణమే సీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ విభాగంలో నూతన సంస్కరణలు చేపట్టాలని భావిస్తున్న సీపీ, ఈ భారీ బదిలీల ద్వారా పనితీరును మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అలాగే ఆదివారం రాత్రి వచ్చిన ఈ బదిలీ ఉత్తర్వుల ప్రకారం, 26 మంది ఇన్‌స్పెక్టర్లను తక్షణమే రిలీవ్ చేసి, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, అబిడ్స్ వంటి కీలక ప్రాంతాల ఎస్‌హెచ్‌ఓ (SHO)లను మార్చడంతో పాటు, సైబర్ నేరాలను అరికట్టే దిశగా ఆ విభాగంలో నూతన అధికారులను కేటాయించారు. ఎన్నికలు, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీస్ శాఖలో జరిగిన ఈ ఆకస్మిక మార్పులు ఇప్పుడు నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Read More..






