- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్.. ఫిదా అయిన సీపీ సజ్జనార్!
చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌పై హైదారబాద్ సీపీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఇటీవల చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌పై హైదారబాద్ సీపీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా వీడియో పంచుకున్నారు. ఒక చేతిలో పేగు బంధం.. మరో చేతిలో సమాజ బాధ్యత! అంటూ ఆయన ఫిదా అయ్యారు. డ్యూటీలో లేకపోయినా, చంటి బిడ్డ చంకలో ఉన్నా.. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్ కోసం స్వయంగా దారి క్లియర్ చేసిన ఏపీలోని రంగంపేట మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతికి హ్యాట్సాఫ్.. అంటూ తెలిపారు. కాకినాడ - సామర్లకోట రోడ్డులో ఆమె చూపిన సమయస్ఫూర్తి, విధి నిర్వహణ పట్ల ఆమెకున్న నిబద్ధత అందరికీ ఆదర్శమని చెప్పారు. మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళ కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా సామర్లకోట ఫ్లైఓవర్ పైన శనివారం రాత్రి విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆమె రంగంలోకి దిగింది. తన బిడ్డను ఎత్తుకొని మరి ట్రాఫిక్ క్లియర్ చేశారు జయశాంతి. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. ఓ చంటి బిడ్డను ఎత్తుకొని మరి ఇలా ట్రాఫిక్ క్లియర్ చేయడం చాలా గ్రేట్ అని నెటిజన్లు కొనియాడారు.






