ప్రియుడి కోసం పసికందును చంపిన కిరాతక తల్లి.. జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-22 08:03:00  IST  )

కేరళలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న ప్రేమను మరిచి ఏడాదిన్నర వయసున్న కుమారుడిని అత్యంత క్రూరంగా హత్య చేసిన తల్లికి ఊహించని షాక్ తగిలింది.

ప్రియుడి కోసం పసికందును చంపిన కిరాతక తల్లి.. జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న ప్రేమను మరిచి ఏడాదిన్నర వయసున్న కుమారుడిని అత్యంత క్రూరంగా హత్య చేసిన తల్లికి ఊహించని షాక్ తగిలింది. కన్న బిడ్డను హతమార్చినందుకు శరణ్యకు కేరళలోని కన్నూరు కోర్టు జీవిత ఖైదు విధించింది. 2020లో జరిగిన ఈ దారుణ ఘటనలో శరణ్య తన చిన్నారిని సముద్రం ఒడ్డున ఉన్న రాళ్లపైకి (సీవాల్) విసిరి ప్రాణాలు తీసింది. ఈ కేసులో ఆమెను ఏకైక దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం, కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

అయితే, ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆమె ప్రియుడు నితిన్‌ను మాత్రం కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. నితిన్‌కు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లేవనే కారణంతో కోర్టు అతడిని విడిచిపెట్టగా, జనవరి 19న శరణ్యను ప్రధాన నిందితురాలిగా ఖరారు చేసింది. స్వార్థం కోసం కన్నబిడ్డనే పొట్టనబెట్టుకున్న ఈ కిరాతక తల్లి ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. సుదీర్ఘ విచారణ అనంతరం నేడు బాధితుడికి న్యాయం జరిగినట్లైందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Read More..

భర్తను చంపి రాత్రంతా శవం పక్కనే కూర్చొని 'పోర్న్ వీడియోలు చూసిన భార్య

Next Story