- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతి ఆరోపణలు.. నైనీ కోల్ మైన్స్ టెండర్లు రద్దు సింగరేణి యాజమాన్యం ప్రకటన
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో కోల్ మైన్స్ టెండర్ల విషయంలో గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే నైనీ బొగ్గు గని తవ్వకాల టెండర్ల లో అవకతవకలు జరిగాయంటూ అవినీతి ఆరోపణలు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో కోల్ మైన్స్ టెండర్ల విషయంలో గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే నైనీ బొగ్గు గని తవ్వకాల టెండర్ల లో అవకతవకలు జరిగాయంటూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. ఇంధన శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం నైనీ కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈరోజు(గురువారం) సాయంత్రం 5 గంటలకు బిడ్లు ప్రారంభం కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
కేంద్రం ప్రశ్నలు - పాలకమండలి వైఫల్యం
తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్ నిబంధనలను రూపొందించేటప్పుడు సింగరేణి పాలకమండలి (Board of Directors) లో ఎందుకు చర్చించలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చర్చ జరిగి ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చేవి కావు కదా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా, టెండర్లు వేయాలనుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయి సందర్శన (Site Visit) ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై కూడా కేంద్రం సీరియస్ అయ్యింది.
రెండోసారి రద్దు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో కోల్ మైన్స్‌లో నైనీ టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి. గతంలో 2016 లో కూడా ఇలాంటి ఆరోపణల వల్లే టెండర్లు రద్దయ్యాయి. "పాలనాపరమైన కారణాల వల్ల టెండర్లను రద్దు చేస్తున్నాం. నిబంధనలపై మరోసారి పాలకమండలిలో కూలంకషంగా చర్చించి, పారదర్శకంగా కొత్త టెండర్లు పిలుస్తాం" అని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. ఈ రద్దుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ భవితవ్యం మళ్ళీ సందిగ్ధంలో పడింది.
READ MORE .....






