- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి దోపిడీ పై సీబీఐ విచారణకు సిద్ధమా.. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సవాల్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో కోల్ మైన్స్ టెండర్ల విషయంలో గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో కోల్ మైన్స్ టెండర్ల వివాదం విషయంలో గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణల నేపథ్యంలో నైనీ కోల్ మైన్స్ టెండర్లు (Naini Coal Mines Tenders) రద్దు చేస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు (N Ramchandra Rao) స్పందిస్తూ.. సింగరేణి కాలరీస్ సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి దోచుకున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే నైనీ కోల్ మైన్స్ టెండర్ల రద్దు వ్యవహారంపై స్పందించిన ఆయన, 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ (Comprehensive investigation) జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
సీబీఐ విచారణపై కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గతంలో నిబంధనలు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు హరీష్ రావు ఏంచేశారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇప్పుడంటే ఇప్పుడే సింగరేణి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రాంచందర్ రావు సవాల్ విసిరారు. పారదర్శకత పై నమ్మకం ఉంటే ప్రభుత్వం ఈ సీబీఐ విచారణ (CBI investigation)కు మొగ్గు చూపాలని సూచించారు.
కంటోన్మెంట్ల విలీనంపై అప్‌డేట్
అలాగే కంటోన్మెంట్ వివాదంపై కూడా ఆయన స్పందిస్తూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్ల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోందని రాంచందర్ రావు వెల్లడించారు. స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ అడుగు వేయబోతోందని ఆయన పేర్కొన్నారు.
READ MORE .....






