అత్యాచార కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పోలీసు కస్టడీ

by Malleboina Mahesh |   (  Updated:2026-01-13 10:17:44  IST  )

కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఎమ్మెల్యే రాహుల్ మాంకూటతిల్‌పై నమోదైన మూడవ అత్యాచార కేసులో తిరువల్ల మెజిస్ట్రేట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అత్యాచార కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పోలీసు కస్టడీ
X

దిశ, వెబ్ డెస్క్: వరుసగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) కు ఊహించని షాక్ తగిలింది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఎమ్మెల్యే రాహుల్ మాంకూటతిల్‌(MLA Rahul Mankutathil) పై నమోదైన మూడవ అత్యాచార కేసు (rape case)లో తిరువల్ల మెజిస్ట్రేట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన జనవరి 15 వరకు పోలీసుల అదుపులోనే ఉండనున్నారు. ఈ సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను విచారించనున్నారు. కాగా, రాహుల్ మాంకూటతిల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జనవరి 16న చేపట్టనుంది. అప్పటివరకు ఆయనకు కస్టడీలోనే కొనసాగాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. గతంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని, తనపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బలవంతంగా అబార్షన్ చేయించారని ఒక మహిళ ఆరోపించారు. శారీరకంగా దాడి చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు నేరుగా కేరళ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో, ఈ కేసును తిరువనంతపురంలోని నెమమ్ (Nemom) పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశారు. ఈ కేసులో కేరళ హైకోర్టు రాహుల్‌కు జనవరి 21వరకు అరెస్టు కాకుండా మధ్యంతర రక్షణ (Interim Protection) కల్పించింది.

అలాగే.. పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలని పిలిపించి, ఒక హోమ్‌స్టేలో (homestay) తనపై లైంగిక దాడి చేశారని 23 ఏళ్ల మరో యువతి ఎమ్మెల్యే రాహుల్ మాంకూటతిల్‌పై ఫిర్యాదు చేసింది. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసింది. ఈ కేసులో సాక్ష్యాధారాల కొరత, ఫిర్యాదు చేయడంలో ఆలస్యం వంటి కారణాలతో తిరువనంతపురం సెషన్స్ కోర్టు రాహుల్‌కు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేసింది. చివరగా మూడో కేసులో కోర్టు ఆయనను పోలీస్ కష్టడికి ఇచ్చింది.

READ MORE .....

వివేక హత్య కేసు.. మరోసారి సుప్రీంకు సునీత

Next Story