వివేక హత్య కేసు.. మరోసారి సుప్రీంకు సునీత

by Thanuru Gopichand |   (  Updated:2026-01-13 10:18:53  IST  )

దిల్లీ నుంచి గల్లీకి.. గల్లీ నుంచి దిల్లీకి.

వివేక హత్య కేసు.. మరోసారి సుప్రీంకు సునీత
X

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda) హత్య కేసులో (Murder Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి (Sunitha Reddy) సుప్రీంకోర్టులో (Supreme Court) మరో అప్లికేషన్‌ దాఖలు చేశారు. సీబీఐ విచారణను కేవలం ఇద్దరి పాత్రకే పరిమితం చేస్తూ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన పాక్షిక ఉత్తర్వులను ఆమె ఈ పిటిషన్‌లో సవాల్ చేశారు. వివేకా హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పెద్దల పాత్రను బయటపెట్టాలంటే పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని ఆమె కోర్టుకు విన్నవించారు. గతంలో జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం దర్యాప్తు కొనసాగింపుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు కేవలం పరిమిత అంశాలకే అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన తాజా అప్లికేషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

​ఈ కేసులో దర్యాప్తు అసంపూర్తిగా ఉందని, అనేక కోణాల్లో నిజాలు వెలుగులోకి రావాల్సి ఉందని సునీతారెడ్డి తన అప్లికేషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ సమర్పించిన నివేదికల్లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపినప్పటికీ, విచారణను కేవలం ఇద్దరికే పరిమితం చేయడం వల్ల కేసులోని లోతైన కుట్ర కోణం వెలుగులోకి రాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల బెయిల్ రద్దు, సాక్షుల భద్రత వంటి అంశాలు కూడా ఈ వివాదంతో ముడిపడి ఉన్నాయి. సుప్రీంకోర్టు వచ్చే వారం చేపట్టబోయే విచారణలో సీబీఐ దర్యాప్తు పరిధిపై ఎలాంటి స్పష్టత ఇస్తుందోనన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చలకు దారితీసిన సంగతి తెలిసిందే.

Read More..

24 గంటల్లో సమస్య పరిష్కారం.. పవన్ కల్యాణ్, నాగబాబు చిత్రపటాలకు పాలాభిషేకం

అత్యాచార కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పోలీసు కస్టడీ

Next Story