- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విభజనలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం వల్లే నేటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఏపీ, తెలంగాణ వేరు కాదు, తెలుగు నేల ఒక్కటే. - డిప్యూటీ సీఎం పవన్

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించలేదని ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (AP Assembly special meeting)లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) విమర్శలు చేశారు. అలాగే ఆనాటి అనాలోచిత నిర్ణయాల వల్లే నేటికీ రాజధాని కోసం కొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినా తమ దృష్టిలో తెలుగు నేల ఎప్పుడూ ఒక్కటేనని, ఆంధ్ర - తెలంగాణ అనే భేదభావం తమకు లేదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఒక బలమైన ఆశావాదిగా అకుంఠిత దీక్షతో పనిచేశారని కొనియాడారు.
అలాగే రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ రాజధాని విషయంపై సందిగ్ధత, ఘర్షణలు కొనసాగడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విభజన సమయంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పాలన పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, కనీస సౌకర్యాలు లేకపోయినా పట్టుదలతో అభివృద్ధి వైపు అడుగులు వేశామని గుర్తు చేశారు. తెలుగు ప్రజలందరూ భాషా పరంగా ఒక్కటేనని భావిస్తూనే, విభజన గాయాల నుంచి కోలుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.






