- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తిన చంద్రబాబు.. అసెంబ్లీ సాక్షిగా ప్రశంసల వర్షం
ఏపీ భవిష్యత్ కోసం పవన్ కల్యాణ్ చేసిన కృషిని మర్చిపోలేమని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయాన్ని గుర్తు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap) భవిష్యత్ కోసం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన కృషిని మర్చిపోలేమని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానం(Amaravati Legalization Resolution)పై చర్చ సందర్భంగా అసెంబ్లీ(Assembly)లో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో ఎన్నికలు జరిగాయన్నారు. ఆ సమయంలో రాష్ట్ర భవిష్యత్ కోసం తాను మాత్రం 2014లో ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. బీజేపీ, టీడీపీకి మద్దతు ఇస్తానని తెలిపారు. అప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయంతో విభజనతో నష్టపోయిన ఏపీకి రెండు పార్టీల పొత్తుతో అధికారంలోకి వచ్చామన్నారు. 2014-19లో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు కూడా పవన్ కల్యాణ్ చాలా మద్దతు ఇచ్చారన్నారు. తాను జైల్లో ఉంటే బీజేపీ, టీడీపీ, జనసేనన కలిపి కూటమికి పురుడు పోశారని గుర్తు చేశారు. రెండు సార్లు పవన్ చేసిన కృషిని నిండు సభలో మనస్పూర్తిగా అభినందిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.






