- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపాలిటీలోని 15, 16 వ వార్డుల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ శబరిష్ ఉత్తర్వుల ప్రకారం మున్సిపాలిటీలోని 15, 16 వ వార్డుల పరిధిలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

దిశ, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ శబరిష్ ఉత్తర్వుల ప్రకారం జిల్లాను గంజాయి, గుడుంబా రహితంగ మార్పులో భాగంగా మహబూబాబాద్ డీఎస్పీ ఎన్.తిరుపతి రావు ఆధ్వర్యంలో కేసముద్రం సీఐ వై. సత్యనారాయణ, సర్కిల్ ఎస్.ఐ లు క్రాంతి కిరణ్, కరుణాకర్, నరేష్, సర్కిల్ సిబ్బంది కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 15 మరియు 16 వ వార్డులలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈరోజు సెర్చ్ లో ముఖ్యంగా గంజాయి త గేవాళ్ళని, రవాణా చేసేవాళ్ళని, గుడుంబా తయారు చేసేవాళ్ళని, నల్ల బెల్లం అమ్మేవాళ్ళని టార్గెట్ చేసుకొని సెర్చ్ నిర్వహించారు. 200 లీటర్ల గుడుంబా, 02 క్వింటల నల్లబెల్లం, 24 లీటర్ల ఐ.ఎం.ఎఫ్.ఎల్ మరియు 4000 లీటర్ల బెల్లం పానకం సీజ్ చేసి వాటిని తయారు చేస్తున వారిపై కేసులు నమోదు చేశారు. కేసముద్రం సర్కిల్ పరిధిలో గంజాయి, గుడుంబా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడితే కఠిన చర్యలు తప్పవు అని తమ అక్రమర్జన కొరకు ఇతరులు ప్రాణాలను పణంగా పెడితే చూస్తూ ఊరుకునేది లేదు అని పోలీసులు హెచ్చరించారు. గంజాయికి సంబంధించిన సమాచారం మాకు 8712656999 నెంబర్ కి ఫోన్ చేసి తెలియచేస్తే మీకు 5000 రూపాయలు బహుమతి ఇవ్వబడును. అలాగే మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని కేసముద్రం సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు.






