- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. యువకుడు మృతి
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మునిరాబాద్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

X
దిశ, మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మునిరాబాద్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై నిలిపి ఉంచిన పాల ట్యాంకర్‌ను వేగంగా వస్తున్న అశోక్ లేలాండ్ బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన కిషోర్ (20) తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






