బొద్దింకలకు చావు లేదు.. అవి భయపడవు.. జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ ఫౌండర్‌ అభిజీత్ దిప్కే

by Prasad Jukanti |   (  Updated:2026-06-06 07:21:25  IST  )

నీట్‌, సీబీఎస్‌ఈ అవకతవకలపై చర్యలు కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టారు.

బొద్దింకలకు చావు లేదు.. అవి భయపడవు.. జంతర్‌ మంతర్‌ వద్ద  సీజేపీ ఫౌండర్‌ అభిజీత్ దిప్కే
X

దిశ, డైనమిక్ బ్యూరో: బొద్దింకలకు భయం ఉండదని అవి ఎప్పటికీ చనిపోవని బొద్దింకలకు భయం ఉండదు, అవి ఎప్పటికీ చనిపోవని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. నీట్‌, సీబీఎస్‌ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ ఉదయం అమెరికా నుంచి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన అభిజిత్ దీప్కే 'డాక్టర్ బి.ఆర్. అబేంద్కర్ మై ఆటోగ్రఫీ' పుస్తకాన్ని అందరికీ చూపిస్తూ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా ఉదయం 11 గంటలకు జంతర్ మంతర్ చేరుకున్నాడు. అక్కడ ఆయనకు మద్దతుదారులు 'భారత్ మాతా కీ జై', ఇంక్విలాబ్ జిందాబాద్' మరియు 'జై భీమ్' నినాదాలతో స్వాగతం పలికారు.బొద్దింకల వేషాలతో యువత ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అభిజిత్ దీప్కే.. దేశ యువత ఇకపై భయపడదని వారు పోరాడతారన్నారు. బొద్దింకలు కూడా భయపడవని అవి ఎప్పటికీ చావవన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము విశ్రమించబోమన్నారు.

సీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత:

కాగా ఈ నిరసనకు పోలీసుల అనుమతి లేకపోవడంతో తొలుత ఏం జరగబోతోందనే టెన్షన్ నెలకొంది. ఇవాళ పోలీసుల అనుమతి రావడంతో నిరసన కార్యక్రమం మొదలైంది. అయితే ఎలాంటి అవాంచనీయ సంఘటనలో జరగకుండా జంతర్ మంతర్ తో పాటు పలు చోట్ల భారీగా పోలీసులు మోహరించారు. మరొవైపు కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసనకారులకు వ్యతిరేకంగా జంతర్ మంతరం వద్ద కొందరు నినాదాలు చేయడం కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే కాక్రోచ్ పార్టీ ఉద్యమంపై బీజేపీ స్పందిస్తూ హిట్ కొట్టి అంతం చేస్తామని పలువురు బీజేపీ నేతలు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇవాళ అభిజిత్ మాట్లాడుతూ కాక్రోచ్ లకు చావు లేదని అవి ఎవరికీ భయపడవంటూ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి కౌంటర్‍గా మాట్లాడారనే టాక్ వినిపిస్తోంది.

Next Story