రోడ్డుపై మద్యం వ్యాన్ బోల్తా.. అందినకాడికి పట్టుకెళ్లిన ప్రజలు

by Ramesh Naini |

చిత్తూరు జిల్లాలోని బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

రోడ్డుపై మద్యం వ్యాన్ బోల్తా.. అందినకాడికి పట్టుకెళ్లిన ప్రజలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిత్తూరు జిల్లాలోని బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు పాలైన మద్యం సీసాలను చూసిన స్థానికులు, దారినపోయే వాహనదారులు వాటిని దోచుకెళ్లేందుకు ఎగబడ్డారు. వాహన యజమాని వద్దని ఎంత వేడుకున్నా ఎవరూ వినిపించుకోలేదని తెలుస్తోంది. అందినకాడికి బాక్సులకు బాక్సులు ఎత్తుకెళ్లగా.. మరికొందరు లుంగీలు, టవళ్లలో మూటగట్టుకుపోయారు. ఆశ్చర్యకరంగా మహిళలు సైతం ఈ మద్యం దోపిడీలో పోటీపడి పదుల సంఖ్యలో బాటిళ్లను పట్టుకెళ్లడం గమనార్హం. చివరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టడంతో.. మిగిలిన కొద్దిపాటి సీసాలు మాత్రమే భద్ర పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారాయి.

Next Story