ఎట్టకేలకు రుతుపవనాల ఎంట్రీ.. దక్షిణ కోస్తా, రాయలసీమకు బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చాయి...

ఎట్టకేలకు రుతుపవనాల ఎంట్రీ.. దక్షిణ కోస్తా, రాయలసీమకు బిగ్ అలర్ట్
X

దిశ వెబ్ డెస్క్: రాష్ట్ర రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చాయి. జూన్ 4న కేరళ తీరంలోకి ప్రవేశించిన ఈ పవనాలు చురుగ్గా కదులుతూ శనివారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమను మరింత విస్తరించనున్నాయి. అయితే రాష్ట్రంలో రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు తీవ్రత, ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు రుతుపవనాల రాకతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Next Story