- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగవంశీకి అనుకోని అదృష్టం.. గట్టి జాక్‌పాట్ తగిలిందిగా
సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో నాగ వంశీ నిర్మిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి సూపర్ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించి, వాటిలో అనేక విజయాలు సాధించి భారీ లాభాలను పొందారు. అయితే ఇటీవల ఆయన నిర్మించిన కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఒక సినిమా ద్వారా అనుకోకుండా పెద్ద లాభాలు దక్కుతున్నట్లు సమాచారం. తమిళ నటుడు సూర్య తాజాగా ‘కరుప్పు’ అనే చిత్రంలో హీరోగా నటించారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటించగా, దర్శకత్వం ఆర్.జె. బాలాజీ వహించారు. సూర్య గతంలో చేసిన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో పాటు, ఈ మూవీ ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో విడుదలకు ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ, 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది.
ఈ విజయంతో సూర్య తదుపరి సినిమాలపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సూర్య, నాగ వంశీ నిర్మాణంలో రూపొందుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కరుప్పు’ భారీ విజయం సాధించడంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా అన్ని రకాల హక్కులకు ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. దీంతో నాగ వంశీకి అనుకోని అదృష్టం కలిసి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






