శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ తనిఖీలు..

by Kodari Anjali |

శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కాలనీలలో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ తనిఖీలు..
X

దిశ, భద్రాచలం: శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కాలనీలలో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రాచలంలోని అయ్యప్ప కాలనీలో శనివారం డీఎస్పీ ఎం అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ ఎం.నాగరాజు సమక్షంలో సీఆర్పిఎఫ్, స్పెషల్ పార్టీ, సివిల్ ట్రాఫిక్ పోలీసులు కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని, పెండింగ్ చలానాలు ఉన్న 37 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను, మద్యంను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా గాని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కాలనీ వాసులను కోరారు.

Next Story