- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉదయం నుంచి పడిగాపులు... అయినా దక్కని ‘యూరియా’
అనకాపల్లి జిల్లా మునగపాకలో యూరియా కొరత, పంపిణీలో లోపాలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నుంచే యూరియా బస్తాల కోసం పడిగాపులు కాసినా ఫలితం లేకపోవడంతో అన్నదాతలు ఒక్కసారిగా రోడ్డెక్కారు...

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) మునగపాక(Munagapaka)లో యూరియా(Urea) కొరత, పంపిణీలో లోపాలపై రైతులు(Farmers) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నుంచే యూరియా బస్తాల కోసం పడిగాపులు కాసినా ఫలితం లేకపోవడంతో అన్నదాతలు ఒక్కసారిగా రోడ్డెక్కారు. సకాలంలో ఎరువులు అందకపోతే పంటలు దెబ్బతింటాయనే ఆందోళనతో మునగపాక ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
గతమే బెటర్
గతంలో రైతు భరోసా కేంద్రాల (RBK) ద్వారా ఏ గ్రామానికి ఆ గ్రామాల్లోనే నేరుగా యూరియా సరఫరా చేసేవారని రైతులు గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ఐదు గ్రామాలకు కలిపి ఒకే చోట పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. ఉదయం నుంచే వేలాది మంది రైతులు ఒకే చోటికి చేరుకోవడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితులు నెలకొన్నాయని, గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పాత పద్ధతిలోనే ఇవ్వాలి
అధికారులు స్పందించి పాత పద్ధతిలోనే ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ఎరువుల పంపిణీ చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఐదు గ్రామాలను ఒకే చోటికి చేర్చి ఇబ్బందులు పెట్టడం సరికాదని, తక్షణమే స్థానిక రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా అందించాలని స్పష్టం చేశారు. అన్నదాతల ఆందోళన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, వ్యవసాయ అధికారులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు. సకాలంలో యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెప్పారు.






