- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో ఈగల్ ఫోర్స్ దాడులు.. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి గంజాయి బ్యాచ్!
హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడుల్లో గంజాయి బ్యాచ్ పట్టుబడింది. గుర్తు తెలియని వ్యక్తులు 1908 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడుల్లో గంజాయి బ్యాచ్ పట్టుబడింది. గుర్తు తెలియని వ్యక్తులు 1908 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు గంజాయి సేవించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో ఈగల్ ఫోర్స్ పోలీసులు నగరంలోని నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ గంజాయి పాజిటివ్ గా తేలడంతో.. ఎర్రగడ్డలో మానసిక చికిత్స అందించే ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల్ని ఈగల్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. షేక్ అహ్మద్, షేక్ అవీజుద్దీన్ లను అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్.. గంజాయి సేవించిన మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. రెండ్రోజుల క్రితమే ఈగల్ ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. కీలక నిందితుడితో పాటు 10 మంది డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేసి.. వారి నుంచి రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ నుంచి హైదరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ ఫోర్స్.. నగరంలో డ్రగ్స్, గంజాయి సరఫరాపై ఫోకస్ పెంచింది.






