- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన.. తెరపైకి కొత్త విద్యాశాఖ మంత్రి పేరు!
నీట్ అవకతవకలపై కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన ముగిసింది. సోనమ్ వాంగ్‍చుక్ దీనికి మద్దతు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం వ్యవస్థలో అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం ముగిసింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంతి యువత జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యావిధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు ఈ సందర్భంగా సీజేపీ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థుల పేర్లను అభిజీత్ దీప్కే చదివి వినిపించారు. కాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సీజేపీ 8 లక్షల సంతకాలను సేకరించింది.
సోనమ్ వాంగ్‍చుక్ మద్దతు:
సీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‍చుక్ (Sonam Wangchuk) మద్దతు తెలిపారు. స్వయంగా జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోనమ్ వాంగ్‍చుక్.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విద్యావిధానంలో మార్పు రావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డిమాండ్ ఆసక్తిగా మారింది. సోనమ్ తమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ నినాదాలపై స్పందించిన సోనమ్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. యువత బాధ్యత తీసుకోవాలని కోరారు.
వేదికపై గందరగోళం:
సీజేపీ నిరసన కార్యక్రమంలో వేదికపా కొద్ది సేపు గందరగోళం ఏర్పడింది. సోనం వాంగ్‍చుగ్ మాట్లాడుతున్న సమయంలో చాలా మంది సీజేపీ ప్రతినిధులు వేదికపై గుమ్మిగూడటంతో అక్కడ అంతా అయోమయం ఏర్పడింది. వీరిని కిందికి దిగిపోవాలని సీజేపీ వ్యవస్థాకుడు అభిజీత్ దీప్కే తో పాటు పలువురు సముదాయించిన పరిస్థితి గందరగోళంగా మారింది. ఆ తర్వాత పరిస్థితి చక్కపడటంతో వక్తలు తమ ప్రసంగాలను కొనసాగించారు. కాగా సీజేపీ పార్టీ ప్రకటించిన తర్వాత అభిజీత్ దీప్కే తొలిసారి భారత్ కు రావడంతో పాటు ఇవాళ జంతర్ మంతర్ వద్ద నిరసన ముగియడంతో పార్టీ భవిష్యత్ కార్యాచణ ఏంటి అనేది ఉత్కంఠగా మారింది.






