- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీకి భారీ షాక్.. జనసేనలో చేరిన కీలక నేతలు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పూసపాటిరేగ మండలం ఎరుకొండ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 15 కుటుంబాలు, కొప్పెర్ల పంచాయతీకి చెందిన 30 కుటుంబాలు సహా మొత్తం 45 కుటుంబాలు జనసేనలో చేరారు...

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vizianagaram District) నెల్లిమర్ల నియోజకవర్గం(Nellimarla Constituency)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి భారీ షాక్ తగిలింది. పూసపాటిరేగ మండలం ఎరుకొండ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 15 కుటుంబాలు, కొప్పెర్ల పంచాయతీకి చెందిన 30 కుటుంబాలు సహా మొత్తం 45 కుటుంబాలు జనసేనలో చేరారు. ఎమ్మెల్యే లోకం మాధవి సమక్షంలో మాజీ సర్పంచ్ నిక్కీ రాము, కొరాడ రమేష్, బూర సంతోష్ కుమార్, నాళం సంతోష్ కుమార్, భావిశెట్టి నారాయణరావు, కూనపురెడ్డి చైతన్య, మారడ వెంకన్న, భావిశెట్టి వినోద్ తదితర కీలక నాయకులంతా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీలో తమకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత లేదని, ప్రజా సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కారణంగా తాము జనసేనలో చేరామని తెలిపారు. భావిశెట్టి నారాయణరావు మాట్లాడుతూ, వైసీపీ పార్టీలో ఉండలేక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే నాయకత్వం, పారదర్శక రాజకీయాలు, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న జనసేనలో పని చేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు






