పైపు లైన్ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

by Nallavelli.Anjaneyulu |

ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే మంచినీటి పైప్ లైన్ పనుల్లో వేగం పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.

పైపు లైన్ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త
X

దిశ, నిజామాబాద్ అర్బన్ : ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే మంచినీటి పైప్ లైన్ పనుల్లో వేగం పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీ మిర్చి కాంపౌండ్ వద్ద కొనసాగుతున్నవాటర్ పైప్ లైన్ నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో ప్రజలకు తాగునీరు సప్లయ్ అవుతున్న పైపుల్లోకి మురుగు నీరు చేరి కలుషితం అవుతోందన్నారు. దీంతో ముప్ఫై ఏళ్ల క్రితం వేసిన పాత పైప్ లైన్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త పైప్ లైన్ నిర్మాణం పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త పైప్ లైన్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. వర్షాలు ప్రారంభం కాకముందే పనులను పూర్తి చేసి వాటి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. వీలైనంత తొందరగా పనులు పూర్తయ్యేలా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలన్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, నాయకులు పవన్ ముందాడ తదితరులున్నారు.

Next Story