- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది
భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

దిశ, సత్తుపల్లి : భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పట్టణ అధ్యక్షుడు భానోత్ విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంబూరి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుని ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని, ముఖ్యంగా యువత తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ కార్యక్రమం ద్వారా ఓటరు నమోదు, సవరణలు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. హెల్ప్ డెస్క్‌ను సందర్శించిన ప్రజలు ఓటరు నమోదుకు సంబంధించిన సమస్యలను వివరించగా, కొత్త ఓటర్ల నమోదు విధానంపై వారికి అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఎల్‌ఏ-1 పాల నాగ సురేందర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జోనల్ గడ్డ నరేష్, జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా, పట్టణ ప్రధాన కార్యదర్శులు మంద శివ యాదవ్, నాగమౌనిక, మైనారిటీ నాయకుడు ఎస్.కె. రహమతుల్లా, డాక్టర్ పెద్దిరాజు, వీరబాబు, మెరుగు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.






