నాన్ లోకల్, లోకల్ ఏంట్రా? అప్పుడలా ఇప్పుడిలా.. అడ్డంగా దొరికిపోయిన బండ్ల

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ప్ర‌కాష్ రాజ్ విష‌యంలో ఒక‌సారి ఒక‌లా.. మ‌రోసారి ఇంకోలా మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు. ఇటీవ‌ల ప్ర‌కాష్ రాజ్ చేసిన ఓ ట్వీట్ పై స్పందిస్తూ అస‌లు ఎవ‌డ్రా నువ్వు.. తెలుగోడివా.. త‌మిళోడివా అంటూ బండ్ల రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.

నాన్ లోకల్, లోకల్ ఏంట్రా? అప్పుడలా ఇప్పుడిలా.. అడ్డంగా దొరికిపోయిన బండ్ల
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ప్ర‌కాష్ రాజ్ విష‌యంలో ఒక‌సారి ఒక‌లా.. మ‌రోసారి ఇంకోలా మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు. ఇటీవ‌ల ప్ర‌కాష్ రాజ్ చేసిన ఓ ట్వీట్ పై స్పందిస్తూ అస‌లు ఎవ‌డ్రా నువ్వు.. తెలుగోడివా.. త‌మిళోడివా అంటూ బండ్ల రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. బండ్ల గ‌ణేష్ కు సంబంధం లేక‌పోయినా మ‌ధ్య‌లో దూరి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కాగా ఇప్పుడు బండ్ల గణేష్, ప్ర‌కాష్ రాజ్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ మాట్లాడిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియోలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిపై తనకు వందల సార్లు ఇరిటేషన్ వచ్చిందని చెప్పారు. 23ఏళ్లుగా తనకు ప్రకాష్ రాజ్ ఆప్తుడు అని అని చెప్పారు.

ఆయన బయటకు ఒకలా కనిపిస్తారు కానీ ఆయన మనసులోకి వెళ్లి చూస్తే అద్భుతమైన మనిషి అని కొనియాడారు. ఇక్కడ నాన్ లోకల్, లోకల్ ఏంటి.. ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఇండియాను ఏలుతున్నాడని వ్యాఖ్యానించారు. ఇక్కడ పుట్టిన రాజమౌళిని హాలీవుడ్ లో సినిమా తీయాలని కోరుతున్నట్టు చెప్పారు. దానికి గర్వపడాలని అన్నారు. ప్రకాష్ రాజ్ 23 ఏళ్ల క్రితం షాద్ నగర్ లో స్థిరపడ్డారని అన్నారు. షాద్ నగర్ లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశార‌ని చెప్పారు. షాద్ న‌గ‌ర్ వ‌చ్చి ప్ర‌కాష్ గురించి అడిగితే చాలా గొప్ప‌గా చెబుతార‌ని వ్యాఖ్యానించారు. బండ్ల గ‌ణేష్ ఈ వ్యాఖ్య‌లు మా ఎన్నిక‌ల స‌మయంలో మాట్లాడారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో బండ్ల అందితే జుట్టు అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకుంటాడ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Next Story