- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబును కలిసిన లింగమనేని రమేశ్..
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్ విషయం తెలిసిందే. అయితే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు..

దిశ, వెబ్ డెస్క్: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్(Lingamaneni Ramesh) నామినేషన్ విషయం తెలిసిందే. అయితే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chief Minister Nara Chandrababu Naidu)ను అమరావతి(Amaravati) ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీలో లింగమనేని రమేశ్‌తో పాటు జనసేనకు చెందిన ప్రముఖ నేతల బృందం కూడా పాల్గొని ముఖ్యమంత్రితో వివిధ అంశాలపై చర్చించింది. సీఎంను కలిసిన వారిలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్‌లతో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల శ్రీనివాస్ కూడా ఉన్నారు. కూటమి నేతల మధ్య జరిగిన ఈ సమావేశం మర్యాదపూర్వకంగా సాగింది.
టీడీపీ 3, జనసేనకి 1 స్థానం
కాగా రాజ్యసభలో ఖాళీ అయిన నలుగురు సభ్యుల స్థానంలో టీడీపీ 3, జనసేనకి 1 స్థానం దక్కింది. కూటమిలో భాగంగా జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా శనివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి ఆశీర్వదం తీసుకున్నారు.






