మర్పల్లి బాధితులకు భరోసానిచ్చిన స్పీకర్

by Batti.Sumithra |

మర్పల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న హోటల్ స్లాబ్ కూలిన ఘటనలో గాయపడిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.

మర్పల్లి బాధితులకు భరోసానిచ్చిన స్పీకర్
X

దిశ, మర్పల్లి : మర్పల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న హోటల్ స్లాబ్ కూలిన ఘటనలో గాయపడిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. ప్రమాదంలో గాయపడి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవడం జరిగిందని తెలిపారు. నలుగురు బాధితులకు తక్షణ సాయం కింద ఆర్థిక భరోసా కల్పించినట్లు చెప్పారు. అలాగే, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితుల వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మధుగు రామేశ్వర్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story