- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలిక పై అఘాయిత్యం -ఇద్దరు నిందితుల పై పొక్సో కేసు
మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి వేరు వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, శంకర్ పల్లి : మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి వేరు వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంకరపల్లి ఇన్స్పెక్టర్ మీర్ ముద్దసిర్ అలీ తెలిపిన వివరాల ప్రకారంగా శంకర్పల్లి పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలిక (15) 9వ తరగతి చదువుతుంది. కాగా బాలికకు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు (28) పరిచయమయ్యాడు. మూడు నెలల క్రితం పరిచయమైన ఆ యువకుడు అమ్మాయితో చనువు పెంచుకొని ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. అయితే జూన్ 1వ తేదీన మరో యువకుడు (22) సైతం బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు.
రాత్రివేళ బాలిక బయటికి వెళ్లి రావడం ఒంటి పై గాయాలను చూసి తల్లి గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లికి తెలిపింది. దీంతో తల్లి గురువారం శంకరపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసునమోదు చేశారు. బాలికను శంషాబాద్ లోని భరోసా కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహించారు. ఇద్దరు నిండితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు అనే విషయాన్ని ధ్రువీకరించుకున్న పోలీసులు పొక్సో నమోదు చేశారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారంగా జరిగిన సంఘటన పై నిందితులను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితులు ఇద్దరిని శనివారం రిమాండ్ కు తరలించారు.






