- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ ఢీ కొని వృద్ధుడు మృతి
రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని అతివేగంగా వచ్చిన ఓ బైక్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

దిశ, భూదాన్ పోచంపల్లి : రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని అతివేగంగా వచ్చిన ఓ బైక్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని అలీనగర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శ్యామల రామస్వామి (80) అనే వృద్ధుడు మేకల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆయన మూత్ర విసర్జన కోసం ఇంటి నుండి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మండలంలోని జూలూరు గ్రామం నుండి అలీనగర్ మీదుగా పెద్దగూడెం వైపు పల్సూర్ బైక్ పై ఒక వ్యక్తి అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి రామస్వామిని బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రామస్వామికి రెండు కాళ్లు, ఎడమ చేయి విరిగిపోయాయి. అంతేకాకుండా చెవిలో నుంచి తీవ్రంగా రక్తం కారడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు శ్యామల బాలనర్సింహా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోచంపల్లి ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.






