దేవుళ్ల పాత ఫొటోలు.. విగ్రహాలు ఉంటే ఇవ్వండి

by Naga Rani Yarlagadda |

దేవుళ్లకు సంబంధించిన పాత ఫొటోలు, విగ్రహాలను పర్యావరణానికి హాని కల్గించకుండా ఎక్కడపడితే అక్కడ పారేయొద్దని, వాటిని గౌరవప్రదంగా అందజేయాలని జీహెచ్ఎంసీ కోరుతోంది.

దేవుళ్ల పాత ఫొటోలు.. విగ్రహాలు ఉంటే ఇవ్వండి
X
  • జీహెచ్ఎంసీ, ఇస్కాన్ ఆధ్వర్యంలో ‘ప్రాజెక్టు ఉద్వాసన’

దిశ, తెలంగాణ బ్యూరో: దేవుళ్లకు సంబంధించిన పాత ఫొటోలు, విగ్రహాలను పర్యావరణానికి హాని కల్గించకుండా ఎక్కడపడితే అక్కడ పారేయొద్దని, వాటిని గౌరవప్రదంగా అందజేయాలని జీహెచ్ఎంసీ కోరుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా.. సైంటిఫిక్ డిస్పోజల్ చేయడంలో భాగంగానే జీహెచ్ఎంసీ, ఇస్కాన్ సంయుక్తంగా ‘ప్రాజెక్టు ఉద్వాసన’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు తమ ఇళ్లలో పూజించిన పాత దేవుడి పటాలు, విగ్రహాలను గౌరవప్రదంగా, పర్యావరణానికి హాని కలగకుండా అందజేసేందుకు ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. బంజారాహిల్స్ లోని ఇస్కాన్ ఆలయంలో జీహెచ్ఎంసీ, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్(ఇస్కాన్) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 100 మంది పౌరుల నుంచి 68 కేజీల పూజా సామాగ్రిని సేకరించారు. ఇందులో ప్రధానంగా దేవుడి ఫోటో ఫ్రేమ్‌లు, పాత విగ్రహాలు ఉన్నాయి. సేకరించిన వాటిలో మంచి స్థితిలో ఉన్న వాటిని ఆసక్తి గల ఇతర భక్తులకు అందజేశారు. పవిత్ర వస్తువుల శాస్త్రీయ పునర్వినియోగం, తదుపరి డ్రైవ్ యూసుఫ్‌గూడలో నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. పాత దేవుడి విగ్రహాలు, పూజా ఫ్రేములు, క్యాలెండర్లు వంటి పవిత్ర వస్తువులను పర్యావరణానికి హాని కలగకుండా, భక్తిభావంతో శాస్త్రీయంగా రీసైకిల్ చేసేందుకు జీహెచ్ఎంసీ ఈ ప్రాజెక్టును చేపట్టింది.

Next Story