- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో తెలుగు యువకుడి దారుణ హత్య
అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెలంగాణలోని మేడ్చల్‌కు చెందిన కుంచా అన్షుల్ న్యూాయార్క్ లో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగులు అతడిని తుపాకీతో కాల్చి చంపారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెలంగాణలోని మేడ్చల్‌కు చెందిన కుంచా అన్షుల్ న్యూయార్క్ లో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగులు అతడిని తుపాకీతో కాల్చి చంపారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి.
గత నెలలో వర్జీనియాలోని ఓ స్టోర్ లో గుజరాత్ కు చెందిన మేఘనపై దుండగుడు కాల్పులు జరిపాడు. స్టోర్ లోకి వచ్చిన దుండగుడు మేఘనతో మాట్లాడుతూ ఆమెపై కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఇది జరిగిన నెల రోజుల్లోనే మరో ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇటీవలికాలంలో అమెరికాల జాత్యహంకార వేధింపులు, దాడులు కూడా పెరిగిపోతున్నాయి. భారతీయులను దూషించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అమెరికా పంపాలి అంటేనే తల్లి దండ్రులు భయపడిపోతున్నారు.






