- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్యూటీ వేళల్లో పేకాటాడుతూ దొరికిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బంది
by Ajay Maddhiboyina |
డ్యూటీ వేళల్లో డ్యూటీ చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బంది పేకాట ఆడుతూ దర్జాగా ఎంజాయ్ చేశారు. కర్మాగారంలోని కోకోవెన్ విభాగంలో విధులకు డుమ్మా కొట్టి మరీ ఐదుగురు శాశ్వత ఉద్యోగులు పేకాట ఆడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: డ్యూటీ వేళల్లో డ్యూటీ చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బంది పేకాట ఆడుతూ దర్జాగా ఎంజాయ్ చేశారు. కర్మాగారంలోని కోకోవెన్ విభాగంలో విధులకు డుమ్మా కొట్టి మరీ ఐదుగురు శాశ్వత ఉద్యోగులు పేకాట ఆడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.7,500 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగులు దర్జాగా పేకాట ఆడటం ఆశ్చర్యకరంగా మారింది. డ్యూటీ చేయకుండా పేకాట ఆడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story






