- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల అండర్-18 హాకీ జట్టు మరోసారి అండర్-18 ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో జపాన్‌ను ఓడించి రికార్డు స్థాయిలో మూడోసారి టైటిల్ సొంతం చేసుకుంది. ఇంతకుముందు 2001, 2016లలో విజేతగా నిలిచింది. శనివారం జరిగిన టైటిల్ పోరులో జపాన్‌పై యువ భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆశిష్ పూర్టి మరోసారి అదరగొట్టాడు. మూడో గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ కేతన్ కుష్వాహా కూడా ఓ గోల్ చేశాడు. దీంతో ఆరంభం నుంచి చివరి వరకూ ఇండియాదే ఆధిపత్యం. ఆఖర్లో జపాన్ ఒక్క గోల్‌తో సరిపెట్టింది. అద్భుత విజయం సాధించిన యువ భారత్‌కు హాకీ ఇండియా క్యాష్ రివార్డు ప్రకటించింది. ప్రతి ప్లేయర్‌కు రూ.3 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్‌లో ప్రతి ఒక్కరికి రూ.1.5 లక్షల నజరానా అందజేయనుంది.
అమ్మాయిల జట్టుకు కాంస్యం
ఈ టోర్నీలో భారత మహిళల అండర్-18 జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సౌత్ కొరియాపై 3-0తో గెలిచింది. సందీప కుమారి, కెప్టెన్ స్వీటీ కుజుర్, నౌషీన్ నాజ్ చెరో గోల్ చేసి ఇండియాను గెలిపించారు. సౌత్ కొరియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఫైనల్‌లో జపాన్‌ను ఓడించిన చైనా టైటిల్ ఎగరేసుకుపోయింది. భారత జట్టులోని ప్లేయర్లకు రూ.లక్ష చొప్పున, సపోర్టింగ్ స్టాఫ్ సభ్యులకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్టు హాకీ ఇండియా ప్రకటించింది.






