రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

by Ajay Maddhiboyina |

రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల‌ను టీడీపీ ఖ‌రారు చేసింది. త‌మ పార్టీ నుండి రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా సానా స‌తీష్, భాష్యం రామ‌కృష్ణ‌, చింత‌కాయ‌ల విజ‌య్ పేర్ల‌ను అధికారికంగా ప్ర‌క‌టించింది. సోమ‌వారం ఈ ముగ్గురు అభ్య‌ర్థులు నామినేష‌న్ వేయ‌నున్నారు.

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల‌ను టీడీపీ ఖ‌రారు చేసింది. త‌మ పార్టీ నుండి రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా సానా స‌తీష్, భాష్యం రామ‌కృష్ణ‌, చింత‌కాయ‌ల విజ‌య్ పేర్ల‌ను అధికారికంగా ప్ర‌క‌టించింది. సోమ‌వారం ఈ ముగ్గురు అభ్య‌ర్థులు నామినేష‌న్ వేయ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే జ‌న‌సేన నుండి లింగ‌మ‌నేని ర‌మేష్ పేరును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతుండ‌గా మూడు స్థానాలు టీడీపీ, ఒక‌స్థానం జ‌న‌సేన తీసుకున్నాయి. కూట‌మి నుండి బీజేపీ సైతం ఒక స్థానాన్ని ఆశించిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు కోరిక‌మేర‌కు ఆ పార్టీ వెన‌క్కిత‌గ్గింది.

దీంతో టీడీపీకే మూడు స్థానాలు ద‌క్కాయి. ఇక టీడీపీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల్లో సానా సతీష్ వ్యాపారవేత్త. ఈయన 2024లోనూ రాజ్యసభకు ఎన్నికయ్యారు.భాష్యం రామకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో విస్త‌రించిన ఉన్న భాష్యం విద్యాసంస్థ‌ల‌కు వ్య‌వ‌స్థ‌ప‌క చైర్మ‌న్ గా ఉన్నారు. మ‌రోవైపు చింత‌కాయ‌ల విజ‌య్ అయ్య‌న్న‌పాత్రుడు వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజ‌య్ కి ఢిల్లీ స్థాయిలో అవకాశం కల్పించడం ద్వారా ఉత్తరాంధ్రలోని బీసీలకు పెద్దపీట వేసినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

Next Story