నాంపల్లిలో మెగా జాబ్ మేళా.. ప్రారంభించనున్న మంత్రి అజారుద్దీన్

by Naga Rani Yarlagadda |

నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో.. జూన్ 9న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించింది.

నాంపల్లిలో మెగా జాబ్ మేళా.. ప్రారంభించనున్న మంత్రి అజారుద్దీన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో.. జూన్ 9న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ జాబ్ మేళాను మైనారిటీస్ వెల్ఫేర్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, కస్టమర్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన 40 నుంచి 50 సంస్థలు పాల్గొననున్నాయి. అర్హత కలిగిన మైనారిటీ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు సూచించారు.

Next Story