- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యతోనే మంచి భవిష్యత్తు : ఎస్పీ శ్రీనివాసరావు
విద్యతోనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పాపన్నపేట లోని ఓ ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్,మై ఛాయిస్ ఫౌండేషన్, యంగిస్థాన్ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో బాల పంచాయతీ (చిల్డ్రన్ పార్లమెంట్ ) కార్యక్రమం నిర్వహించారు.

దిశ, పాపన్నపేట : విద్యతోనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పాపన్నపేట లోని ఓ ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్,మై ఛాయిస్ ఫౌండేషన్, యంగిస్థాన్ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో బాల పంచాయతీ (చిల్డ్రన్ పార్లమెంట్) కార్యక్రమం నిర్వహించారు. పాపన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్య,బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ నిర్మూలన,పారిశుద్ధ్యం,త్రాగునీరు బాలల రక్షణ అంశాల పై అధికారులతో చర్చించారు. విద్యార్థుల్లో ప్రశ్నించే నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, డీఎస్పీ ప్రసన్నకుమార్, తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, సీఐ లు జార్జి, రాజశేఖర్, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, ఎంఈవో ప్రతాప రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, డీసీపిఓ నాగరాజు, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి , సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






