పులి కోసం వేట.. దేవిపట్నం ఆటవీ ప్రాంతంలో ఉత్కంఠ

by Vemula.Srinu Prasad |

పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లె పరిసరాల్లో పులి సంచారం నేపధ్యంలో శనివారం హనుమాన్ ఆపరేషన్ వేగవంతం చేశారు....

పులి కోసం వేట.. దేవిపట్నం ఆటవీ ప్రాంతంలో ఉత్కంఠ
X

దిశ, ఏపీ బ్యూరో: పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లె పరిసరాల్లో పులి సంచారం నేపధ్యంలో శనివారం హనుమాన్ ఆపరేషన్ వేగవంతం చేశారు. గంగపాలెం గ్రామం శివారులో ఈ నెల 2వ తేది రాత్రి పశువుల పాక పై పెద్ద పులి దాడి ఘటనలో 14 దూడలు చనిపోగా, ఆటవీ శాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు. గంగంపాలెం ( గంగవరం) దండంగి, పోశమగండి, పెదపోడు డి రావిలంక అడ్డతీగలం గ్రామాల ఆటవీ ప్రాంతంలో పులి సంచారం నేపధ్యంలో ప్రజలలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఆటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పులిని పట్టుకోవాలని ఆటవీ శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. సుమారు 200 మంది ఆటవీ శాఖ సిబ్బంది, పోలీసులు, హనుమన్ బృందాలు ప్రభుత్వం యంత్రాంగం పులి వేటలో నిమగ్నమైయ్యారు. పులికి మత్తుమందు ఇచ్చి బంధించేందుకు అధికారుల యత్నిస్తున్నారు. రంగంలోకి బెంగళూరు నిపుణుల బృందం రాగా, విధుల్లో 22 హనుమాన్ బృందాలు పులిని పట్టుకునేందుకు మూడు డ్రోన్ బృందాలు పులి కదలికలను పర్యవేక్షిస్తు, హనుమన్ బృందాలకు సమాచారం అందచేస్తున్నారు. పూడిపల్లె పరిసరాలలో పులి సంచారిస్తున్నట్లుగా గుర్తించిన ఆటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.

Next Story