- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pralhad Joshi: విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
by S Gopi |
తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర విద్యాశాఖ అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి, ఈ పదవిని బాధ్యతతో పాటు ఎంతో గౌరవంగా స్వీకరిస్తున్నానని చెప్పారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో ఎన్నో చారిత్రాత్మక సంస్కరణలు జరిగాయని, ముఖ్యంగా జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు ద్వారా విద్యారంగంలో కీలక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశంసిస్తూ, విద్యా రంగంలో ఆయన చేసిన సేవలు, చేపట్టిన కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో పనిచేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి అంకితభావంతో నిర్వర్తించి, ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా పని చేస్తానని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.
Next Story






