- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ షాక్‌తో కార్మికుడి మృతి
by Jakkula.Mamatha |
ఆదిలాబాద్ పట్టణంలోని రాణిసతిజి కాలనీలో కరెంట్ షాక్‌కు గురై ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది.

X
దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని రాణిసతిజి కాలనీలో కరెంట్ షాక్‌కు గురై ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌కు చెందిన సురేష్ అనే కార్మికుడు విద్యుత్ స్తంభం ఎక్కి తీగలు బిగిస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో స్తంభంపైనే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే పైకి ఎక్కి మృతదేహాన్ని కిందకు దించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ మరమ్మతుల సమయంలో తగిన భద్రతా చర్యలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story






