- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ప్రముఖులు
by Batti.Sumithra |
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, దేవస్థానం అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story






